Opposition Alliance I.N.D.I.A : విపక్షాల కూటమి I.N.D.I.Aపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

26 రాజకీయ పార్టీలు కూటమికి I.N.D.I.A పేరు ఉపయోగించకుండా పిటిషనర్ కోరాడు. I.N.D.I.A పదం వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Delhi High Court

PIL Against Opposition Alliance I.N.D.I.A : విపక్షాలు తమ కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. విపక్షాల 26 రాజకీయ పార్టీలు తమ కూటమికి I.N.D.I.A అన్న పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, 26 పార్టీల కూటమి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

తదుపరి విచారణకు అక్టోబర్ 31కు వాయిదా వేసింది. 26 రాజకీయ పార్టీలు కూటమికి I.N.D.I.A పేరు ఉపయోగించకుండా పిటిషనర్ కోరాడు. I.N.D.I.A పదం వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా బలంగా పోరాడేందుకు 26 పార్టీలు కలిసి I.N.D.I.A కూటమిగా ఏర్పాడ్డాయి.

Tomato pooja : ధరలు తగ్గించు తల్లీ .. టమాటాలతో అమ్మవారికి పూజలు,టమాటాలే నైవేద్యం..భక్తులకు అవే ప్రసాదం

గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న కూటమికి యూపీఏ ఉండేది. ఆ పేరును పక్కన పెట్టి I.N.D.I.A అని కొత్త పేరు పెట్టారు. గతంలో బెంగళూరులో సమావేశమైన విపక్షాలు తమ కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టాయి. తాజాగా విపక్షాలు తమ కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు