PM Kisan Date : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై క్లారిటీ.. బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యేది ఆరోజే..

PM Kisan 24th Instalment Date : ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయంను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.

PM Kisan 24th Instalment Date

PM Kisan 24th Instalment Date : దేశవ్యాప్తంగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఈ పథకం కింద అందించే 24వ విడత నిధులను అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నేరుగా జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ విడత ద్వారా సుమారు 9.34 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించనున్నారు.

Also Read : CM Chandrababu Naidu : తెలంగాణ మంత్రి సీతక్కపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్..

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయంను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 23వ విడత నిధులను ఈ ఏడాది జూన్‌ 20న విడుదల చేశారు. ఇప్పుడు 24వ విడత నిధులను అక్టోబర్‌ 30న రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది.

పీఎం కిసాన్‌ నిధులు రావాలంటే ఇలా చేయాలి..

  • పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 సకాలంలో అందాలంటే రైతులు తమ వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలి.
  • ఈ-కేవైసీ: పీఎం కిసాన్‌ పథకంలో ఈ-కేవైసీ తప్పనిసరి.
  • ఆధార్‌ అనుసంధానం: బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి.
  • భూమి వివరాల ధ్రువీకరణ: భూ రికార్డుల పరిశీలన పూర్తయిందో లేదో నిర్ధారించుకోవాలి.
  • బ్యాంకు ఖాతా వివరాలు: ఖాతా చెల్లుబాటులో ఉండటంతో పాటు డబ్బు జమ కావడానికి అవసరమైన అనుసంధానాలు పూర్తయి ఉండాలి.
  • లబ్ధిదారుల స్థితి: పథకానికి అర్హత, చెల్లింపు వివరాలను అధికారిక పోర్టల్‌లో తనిఖీ చేయాలి.

మీ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి..

  • రైతులు పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవచ్చు.
  • pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  • Farmers Corner విభాగంలో Know Your Status ఎంపికను ఎంచుకోండి.
  • మీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేయండి.
  • క్యాప్చా, ఓటీపీ వంటి ధ్రువీకరణ వివరాలను పూర్తి చేయండి.
  • మీ చెల్లింపు స్థితి, ఈ-కేవైసీ వివరాలను పరిశీలించండి.