PM Kisan: వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు.. మీరు అప్లై చేసుకున్నారా? ఇలా చేయండి చాలు
PM Kisan: కేంద్ర ప్రభుత్వ పథకం(Government Scheme) నిధులు జూలై నెలలోలబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- June 12, 2026 / 12:44 PM IST
PM Kisan government scheme are set to be credited to accounts in July.
- జులై లో పీఎం కిసాన్ పథకం డబ్బులు
- రైతు ఖాతాలో రూ.2000
- మీరు అప్లై చేసుకున్నారా?
PM Kisan: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సాయం రైతులకు అందుతోంది. ఈ డబ్బును ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం లెక్కన నిధులు జమ చేస్తున్నారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోకి రిలీజ్(Government Scheme) చేస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ నిధులను ప్రతీ విడతలో బటన్ నొక్కి విడుదల చేస్తుండటం విశేషం.
*Narendra Modi: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్
ఈ పథకానికి ఎవరు అర్హులంటే?
- దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి
- వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి
- ఐదు ఎకరాల్లోపు పోలం కలిగి ఉండాలి
- ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు
దరఖాస్తు ఇలా చేసుకోండి?
- ముందు https://pmkisan.gov.in/ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
- తరువాత ‘కొత్త రైతు నమోదు’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి
- క్యాప్చాను ఎంటర్ చేయాలి
- అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి
- తరువాత ‘అవును’పై క్లిక్ చేయాలి
- తరువాత దరఖాస్తు సేవ్ చేసి, ఫారంను ప్రింట్ తీసుకోవాలి
స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
- ముందు https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి
- తరువాత ‘మీ స్థితిని తెలుసుకోండి’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి
- తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి
- తరువాత ‘గెట్ డేటా’పై క్లిక్ చేయాలి
- ఇప్పుడు మీ స్టేటస్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది
పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు 2026 జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. మార్చి 13న అస్సాంలోని గౌహతిలో 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. 9.32 కోట్ల మంది రైతులకు రూ. 18,640 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు 22 విడతలలో మొత్తం రూ. 4.25 లక్షల కోట్లు పంపిణీ చేశారు.
