ఒడిషా చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

  • Publish Date - May 22, 2020 / 10:24 AM IST

ఒడిషాలోఅంఫాన్  తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భువనేశ్వర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కొలకత్తా నుంచి భువనేశ్వర్ చేరుకున్నఆయనకు సీఎం నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషీలాల్ ఇతర ఉన్నతాధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం మోడీ  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. 

అంఫాన్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించలేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను వల్ల కోస్తా జిల్లాల్లో సుమారు 45 లక్షల మందిని ప్రభావితం చేసిందని, పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం సంభవించిందని వెల్లడించింది. ఈ తుఫాను వల్ల మరణించినట్లు తమ వద్ద అధికారిక సమాచారం లేదని వెల్లడింది. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌లో ప్రధాని ఏరియల్‌ సర్వే నిర్వహించి రాష్ర్టానికి రూ.వెయ్యి కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

 

Read: 83రోజుల తర్వాత ఢిల్లీ దాటిన మోడీ…కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో మమత స్వాగతం