PM Modi : భారత్‌లో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. దేశం 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి.

PM Modi :ఇది తనకు అద్భుతమైన క్షణం. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. దేశ ప్రజలే తనకు దేవుళ్లు.. అధికారాన్ని సేవగానే భావించానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Narendra Modi

PM Modi : వికసిత్ భారత్ -2047 దిశగా ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. దేశంలో వస్తోన్న పెను మార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మనవైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానిగా 12ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఇది తనకు అద్భుతమైన క్షణం. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. దేశ ప్రజలే తనకు దేవుళ్లు.. అధికారాన్ని సేవగానే భావించానని మోదీ అన్నారు.

Also Read : Pawan Kalyan : ‘మీ అయ్య జాగీరా‘ అని అందుకే అన్నా.. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాకే విద్వేషాలు.. బీఆర్ఎస్ హయాంలో ఇలాలేదు..

ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. ఎన్డీయేలో ఉన్న అన్ని పార్టీలకు ఈ విజయం దక్కుతుందని, దేశ రాజకీయాల్లో నేడు చారిత్రకమైన రోజుగా ప్రధాని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో అనేక సమస్యలు ఉండేవి.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మార్పులు తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో చేసిన తప్పులను సరిచేయడంతోపాటు.. గత 12ఏళ్లుగా దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని, దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని మోదీ చెప్పారు.

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయన్న మోదీ.. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. భారత్ 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత పెనుమార్పులను ప్రజలు బేరీజు వేసుకోవాలని మోదీ పేర్కొన్నారు.

12ఏళ్ల ఎన్డీయే పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మోదీ చెప్పారు. గతంలో 370 ఆర్టికల్ అంటేనే భయపడేవారు.. మేము రద్దు చేశామని.. గతంలో ఉగ్రవాదం పేరు చెబితే భయపడేవారు.. మేము వచ్చాక దాడులు చేశాం.. అదేవిధంగా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించామని మోదీ చెప్పారు. 12ఏళ్ల అద్భుతమైన పాలనతో ప్రపంచ దేశాలుసైతం భారత్ వైపు చూసేలా చేశామని, దేశంలో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని, భారత్ కు ప్రపంచ దేశాల్లో ఎంతో గౌరవాన్ని పెంపొందేలా ఎన్డీయే 12ఏళ్ల పాలన సాగిందని మోదీ చెప్పుకొచ్చారు.