PM Modi New Video : ధన్యవాదాలు మిత్రులారా అంటూ.. అర్థరాత్రి మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ
PM Modi New Video : నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అర్ధరాత్రి మరో వీడియోను సోషల్ మీడియాను విడుదల చేశారు.
- Harish Thanniru
- Updated on- July 25, 2026 / 07:14 AM IST
PM Modi New Video
- అర్ధరాత్రి ప్రధాని మోదీ మరో వీడియో
- తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్టు చేసిన మోదీ
- విలువైన సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
PM Modi New Video : నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అర్ధరాత్రి మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి తను పోస్టు చేసిన వీడియోపై అభిప్రాయాలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ మోదీ ఆ వీడియోలో పేర్కొన్నారు.
Also Read : NTA Action: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం కఠిన చర్యలు.. NTA నుంచి 47 మంది అధికారుల తొలగింపు
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో మోదీ మాట్లాడుతూ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi shared a video on his Instagram handle;, “Thanks to the youngsters who watched my video yesterday and sent insightful suggestions.”
He says, “Thank you friends. I had the opportunity to meet you late last night. I appreciate the way you… https://t.co/B4hrqwPwic pic.twitter.com/t6hfaVcvET
— ANI (@ANI) July 24, 2026
గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన తొలి వీడియోలో పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. ఆ వీడియోకు కోట్లాది వ్యూస్ రావడంతో పాటు, లక్షలాది మంది యువత తమ అభిప్రాయాలను, సూచనలను పంచుకున్నారు. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కొత్త వీడియోను విడుదల చేశారు.
ఇదిలాఉంటే.. గురువారం అర్ధరాత్రి ప్రధాని వీడియో పోస్ట్ చేసిన 8నిమిషాల్లోనే 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 నిమిషాల్లోనే 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 10లక్షలకు పైగా కొత్తగా ఫాలో అయ్యారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై యువతతో నేరుగా మమేకం కావడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా యువతతో మరింత చురుకుగా అనుసంధానం కావాలని కేంద్ర మంత్రులకు కూడా ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం.
