Baba Ramdev: బాబా రాందేవ్ పై పోలీస్ కేసు
ఇక ఇదిలా ఉంటే రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో పోలీస్ కేసు నమోదైంది. ఐఏంఏ చత్తీస్‌గఢ్ యూనిట్ ఫిర్యాదుపై రాందేవ్‌పై కేసు నమోదైనట్టు రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
- kunduru Vinod
- Published On : June 17, 2021 / 05:37 PM IST
Baba Ramdev
Baba Ramdev: యోగ గురువు బాబా రాందేవ్ ఇటీవల అల్లోపతి వైద్యంపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాందేవ్ వ్యాఖ్యలపై అల్లోపతి వైద్యులు దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు బాబా రాందేవ్..
ఇక ఇదిలా ఉంటే రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో పోలీస్ కేసు నమోదైంది. ఐఏంఏ చత్తీస్‌గఢ్ యూనిట్ ఫిర్యాదుపై రాందేవ్‌పై కేసు నమోదైనట్టు రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
రాందేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో హాస్పిటల్ బోర్డ్ ఐఎంఏ చైర్మన్ డాక్టర్ రాకేశ్ గుప్తా, ఐఎంఐ రాయ్‌పూర్ అధ్యక్షుడు వికాశ్ అగర్వాల్ తదితరులు ఉన్నారు. కాగా ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.