Ketan Agarwal Murder Case: పూణే హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. క్రైం సీన్ రీ క్రియేషన్ లో సంచలన నిజాలు.. కుటుంబ సభ్యుల ఆవేదన

కేసులో ఆధారాలను పటిష్టం చేసేందుకు పోలీసులు నిందితులిద్దరినీ లోహగఢ్ కోటకు తీసుకెళ్లి 'క్రైమ్ సీన్ రీక్రియేషన్(Ketan Agarwal Murder Case)' చేశారు.

Police recreated the crime scene with Siya Goyal and Chetan Chaudhary in Ketan Agarwal murder case.

  • లోహగఢ్ కోటలో దారుణ హత్య
  • నిందితుల క్రైమ్ సీన్ రీక్రియేషన్
  • కఠిన శిక్షకై కుటుంబం డిమాండ్

Ketan Agarwal Murder Case: పూణే సమీపంలోని లోహగఢ్ కోటలో జరిగిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన, ఒక పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా తేలింది. కేతన్ (Ketan Agarwal Murder Case)కాబోయే భార్య సీయా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌధరీ (22) కలిసి అతడిని 400 అడుగుల లోతైన లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సీయాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా, కుటుంబ ప్రతిష్ట కోసం నిశ్చితార్థం రద్దు చేసుకోలేక, ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది.

Mission Vatsalya: ఏపీలో పిల్లలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ.4 వేలు.. డైరెక్ట్ అకౌంట్ లోకే

కేసులో ఆధారాలను పటిష్టం చేసేందుకు పోలీసులు నిందితులిద్దరినీ లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ‘క్రైమ్ సీన్ రీక్రియేషన్’ చేశారు. హత్యకు ముందు ఏం జరిగింది? బాధితుడిని ఎక్కడికి తీసుకెళ్లారు? లోయలోకి ఎలా తోసేశారు? అనే అంశాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకుంటూ వీడియో చిత్రీకరించారు. నిందితుల వాంగ్మూలాలను, ఘటనా స్థలంలోని భౌతిక ఆధారాలను సరిపోల్చేందుకు పది రోజుల తర్వాత చేపట్టిన ఈ ప్రక్రియ కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదికలు, మొబైల్ డేటా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు పక్కాగా ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు, నిందితులకు ఉరిశిక్ష లేదా కఠినమైన శిక్ష పడేలా చూడాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన ఘోర హత్యేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో ఈ హత్యకు సంబంధించి వస్తున్న కొన్ని వదంతులను పోలీసులు కొట్టిపారేశారు. బాధితుడు విగ్గు పెట్టుకోవడం నచ్చకే సీయా ఈ హత్య చేసిందంటూ ప్రచారంలో ఉన్న వార్తలు కేవలం ఫేక్ అని, అసలు కారణం ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడమేనని అధికారులు స్పష్టం చేశారు.