Coimbatore : హోటల్లో పోలీసు వీరంగం, లాఠీతో చితకబాదాడు..వీడియో వైరల్
హోటల్ లో ఓ పోలీసు వీరంగం సృష్టించారు. అక్కడున్న వారిని లాఠీతో చితకబాదాడు. పురుషులను లాఠీలతో బాదాడు.
- madhu
- Updated on- April 12, 2021 / 07:14 PM IST
Policeman caught on camera
Policeman Caught On Camera : హోటల్ లో ఓ పోలీసు వీరంగం సృష్టించారు. అక్కడున్న వారిని లాఠీతో చితకబాదాడు. పురుషులను లాఠీలతో బాదాడు. అక్కడున్న మహిళలను మాత్రం ఏమీ అనలేదు. హోటల్ లో సీసీ కెమెరా ఉందనే విషయం సదరు పోలీసుకు తెలియదేమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసు ఎందుకు అలా కొట్టాడనే దానిపై హోటల్ యజమాని స్పందించారు.
కొయంబత్తూరులోని గాంధీపురంలో శ్రీ రాజా పేరిట హోటల్ ఉంది. రాత్రి 10.21 గంటలకు ఓ పోలీసు లాఠీతో హోటల్ లోకి వచ్చాడు. అప్పుడు కొంతమంది కస్టమర్లు భోజనం చేస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. వస్తూ వస్తూనే లాఠీకి పని చెప్పాడు. వెళ్లిపోవాలని చెప్పడంతో అందులో పనిచేసే వర్కర్స్, కస్టమర్లు బయటకు వెళ్లడానికి వస్తుండగా..లాఠీతో వెనుక నుంచి ఇష్టమొచ్చినట్లు బాదాడు. చివరిగా వస్తున్న వ్యక్తిని కొట్టగా..ప్రమాదవశాత్తు అక్కడనే ఉన్న ఓ యువతికి లాఠీ దెబ్బ తగిలింది. ఆ పోలీసు సారీ చెబుతున్నట్లుగా వీడియోలో కనిపించింది.
దీనిపై హోటల్ యజమాని స్పందించాడు. లంచం ఇవ్వాలని పోలీసులు అడిగారని తెలిపారు. ఇప్పుడు కొట్టిన ఎస్ఐ గతవారం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని, డబ్బులు ఇవ్వలేదని వెల్లడించారు. డబ్బులు ఇవ్వాలని తాను కోరడం జరిగిందని యజమాని ఆరోపించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. దాడి చేసిన సదరు ఎస్ఐ ముత్తుగా తేలింది. ఆయన్ను ట్రాన్స్ ఫర్ చేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Read More : Serving In Flight Meals : విమానాల్లో రెండు గంటలు కన్నా..ఎక్కువ ప్రయాణించే వారికే ఫుడ్
