లాక్ డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసేసి కేవలం నిత్యవసర వస్తువులను, మెడికల్ అవసరాలకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. ఇదే అదనుగా చేసుకుని పుట్టగొడుగుల్లా మెడికల్ షాపులు ఓపెన్ అయిపోతున్నాయి. పైగా డిమాండ్‌ను బట్టి MRPకంటే ఎక్కువకు అమ్మి దోపిడీ చేస్తున్నారు లోకల్ రిటైలర్లు. వీటిపైనా కంట్రోల్ విధించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ వెల్లడించారు.
‘ద నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ డివైస్ లలో రకాలైన 24 అన్నింటిపైగా క్వాలిటీ కంట్రోల్ వారు నియంత్రణ చూపించాలని అన్నారు. ఆర్డర్ 2013ప్రకారం.. ప్రతి ఒక దానిపైనా కంట్రోల్ ఉండాలి. మెడికల్ మ్యాన్యుఫ్యాక్చర్లు సైతం మెడికల్ డివైజ్‌లను గత 12 నెలల్లో ఉన్న ధర కంటే కేవలం 10శాతమే పెంచాలి.
అది కూడా డ్రగ్స్ అండ్ మెడికల్ డివైజ్‌లను ఎన్పీపీఏ నేతృత్వంలనే జరగాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకునేందుకు మెడికల్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. ఇదే అదనుగా చేసుకుని రేట్లు పెంచేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ కు తొలి ప్రాధాన్యతనిస్తూ.. జాగ్రత్త పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read | ఏపీలో కరోనా కల్లోలం : ఆ రెండు జిల్లాలు సేఫ్