PM Modi Review : కరోనా థర్డ్ వేవ్‌పై ప్రధాని మోదీ సమీక్ష.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం..!

థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్-19 సమీక్ష సమావేశం జరగనుంది.

PM Modi Review : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు పైగా నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్-19 సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులు, వైద్య నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సి చర్యలపై పలు సూచనలు చేయనున్నారు.

చదవండి : Corona Cases : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 22 లక్షలకుపైగా కేసులు

ఇదిలాఉంటే.. గతంలో ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 327 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 3,623 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.

చదవండి : Corona Spread : కరోనా విలయం.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

 

 

ట్రెండింగ్ వార్తలు