Principal to touch student’s feet: స్టూడెంట్స్ రౌడీయిజం.. విద్యార్థిని కాళ్లు పట్టుకుని ప్రిన్సిపాల్ క్షమాపణలు!
అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఓ విద్యార్థి కాళ్ళు మొక్కుతూ..తనను క్షమించమని అడిగారు. ఇదంతా ABVP నాయకుల ఆధ్వర్యంలో జరిగింది.
- Naresh Mannam
- Published on- May 16, 2022 / 09:39 PM IST
Principal To Touch Student’s Feet
Principal to touch student’s feet: విద్యార్థులు తప్పు చేస్తే.. ఉపాధ్యాయులు దండిస్తారు. సరిగ్గా చదవకపోయినా, చెడు వ్యసనాలకు బానిసైన గురువులే మార్గంలో నడిపిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుల పట్ల మనం గౌరవ, మర్యాదలతో ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ఓ ప్రిన్సిపాల్. ఓ విద్యార్థి పాదాలకు తాకాల్సి వచ్చింది. అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఓ విద్యార్థి కాళ్ళు మొక్కుతూ..తనను క్షమించమని అడిగారు. ఇదంతా ABVP నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్ల, రాష్ట్ర విద్యా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎస్‌ఏఎల్ డిప్లమో కాలేజీకు చెందిన ఓ విద్యార్థినికి రెండో సెమిస్టర్‌లో అటెండెన్స్ షార్టేజ్ వచ్చింది. ఈ విషయంపై ABVP నాయకుడు అక్షత్ జైస్వాల్.. ఇతర ఏబీవీపీ సభ్యులతో కలిసి ప్రిన్సిపాల్ మోనికా స్వామి ఛాంబర్‌కి వెళ్లారు. ప్రిన్సిపాల్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రిన్సిపాల్ బలవంతంగా విద్యార్థిని పాదాలకు తాకి.. క్షమాణాలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటనపై కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషన్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీవీపీ కార్యకర్తల చర్య సిగ్గు చేటని.. NSUI జాతీయ కన్వీనర్ భావిక్ సోలంకి పేర్కొన్నారు. ABVP కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శమన్నారు.
మరోవైపు జైస్వాల్ చర్యకు క్షమాపణలు చెబుతూ ABVP ఓ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉన్న పవిత్ర సంబంధాన్ని ABVP విశ్వసిస్తుంది. ఇలాంటి ఘటనకు ABVP ఎన్నటికీ క్షమించదని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి ప్రార్థన్ అమిన్ తెలిపారు. దీంతో అక్షత్ జైస్వాల్ ను సంస్థ నుంచి బహిష్కరించారు. అనంతరం ABVP సీనియర్ నాయకులు.. ప్రిన్సిపాల్ మోనికా స్వామి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పారు.
ગુરૂ ની ગરિમા ને તાર- તાર કરનાર @ABVPGujarat નાં નેતાઓ સામે @jitu_vaghani શિક્ષણ વિભાગ ખુદ ફરિયાદી બને – @NSUIGujarat @Neerajkundan@jagdishthakormp @Pawankhera @rssurjewala @drmanishdoshi@IG_Gohil_ @SatveerINC @Mahipalsinh_INC#SameOnABVP#एबीवीपी_के_गुंडे pic.twitter.com/IBXsYc87H8
— Bhavik Solanki (@bhaviksolankee) May 13, 2022
