×
Ad

Bus Accident : పండుగ వేళ ఘోర ప్రమాదం.. ప్రైవేట్‌ బస్సును ఢీ కొట్టిన లారీ.. ప్రయాణికుల సజీవ దహనం

Bus Accident : కర్ణాటక రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో

Bus Accident

Bus Accident : కర్ణాటక రాష్ట్రంలో పండుగ వేళ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులోని 17మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుంది. హెబ్బులి హైవేపై హిరియార్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు పచేపట్టారు.

లారీ ఢీ కొట్టినే తరువాత బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలుకాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.