5వ రోజుకు సీఎం నారాయణస్వామి దీక్ష : ఇంటిపై నల్లజెండాతో నిరసన

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరింది.

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 12:13 PM IST
5వ రోజుకు సీఎం నారాయణస్వామి దీక్ష : ఇంటిపై నల్లజెండాతో నిరసన

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరింది.

పుదుచ్చేరి : పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరింది. గవర్నర్ కిరణ్ బేడీని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టారు. తన ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నారాయణస్వామి నిరసన వ్యక్తం చేశారు. కిరణ్ బేడీతో రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయని నారాయణస్వామి ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాలని డిమాండ్ చేశారు.

 

వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి వాడాలని కిరణ్ బేడీ జారీ చేసిన ఆదేశాలను సీఎం నారాయణస్వామి తప్పుబడుతున్నారు. హెల్మెట్ తప్పనిసరి నిబంధనలను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు హెల్మెట్ వాడకం ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని..అప్పటివరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.