Puducherry Election Results 2026 Live: పుదుచ్చేరిలో మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే..
Puducherry Election Results 2026 Live : కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు మరికొద్ది సేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి.
- Harish Thanniru
- Updated on- May 4, 2026 / 02:41 PM IST
Puducherry Election Results 2026 Live
Puducherry Election Results 2026 Live: విల్లైనూర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత శివను ఓడించిన AINRC అభ్యర్థి రవికుమార్.
మన్నాడిపేట్ నియోజకవర్గంలో గెలుపొందిన బీజేపీ. పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే నమశ్శివాయం ధీమా వ్యక్తం చేశారు.
యానాంలో గెలిచిన AINRC. ఆ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు.
ఔస్సుడు సీటు దక్కించుకున్న కాంగ్రెస్. బీజేపీ అభ్యర్థి తీప్పనాథన్ మీద గెలుపొందిన కార్తికేయన్.
ముత్యాలపేట సీటు దక్కించుకున్న AINRC
మహే నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ లీడింగ్ లో ఉన్నారు.
పుదుచ్చేరిలో రెండు చోట్ల ఆధిక్యంలో సీఎం రంగస్వామి.
పుదుచ్చేరిలో ఎన్డీయే హవా కొనసాగుతోంది. పుదుచ్చేరిలో ఉన్న 30 సీట్లలో 18 సీట్లలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. అంటే మేజిక్ ఫిగర్ దాటిపోయింది. కాంగ్రెస్ కూటమి కేవలం 5 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే హవా కనిపిస్తోంది. ఎన్ఆర్ సీ, బీజేపీ కూటమి ముందంజలో ఉంది. తమిళనాడులో దూసుకెళ్తున్న డీఎంకే పుదుచ్చేరిలో వెనుకబడింది. ఎర్లీ ట్రెండ్స్ లో విజయ్ టీవీకే పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు మరికొద్ది సేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఇక్కడ ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే, ఈసారి రికార్డు స్థాయిలో 91.23 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకుని కచ్చితమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గెలుపును ఆశిస్తున్నది. ఈ క్రమంలో ఫలితాలపై మరికొద్ది సేపట్లో స్పష్టత రానుంది.
