CM Vijay : సీఎంగా ప్రమాణం తరువాత విజయ్ పొలిటికల్ స్పీచ్‌లో 10 పంచ్ డైలాగ్స్ ఇవే..
CM Vijay : తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత విజయ్ మాట్లాడుతూ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
- Harish Thanniru
- Published on- May 10, 2026 / 01:37 PM IST
Vijay speech after taking oath as CM
CM Vijay : తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల హర్షధ్వానాల మధ్య విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ ఆర్లేకర్ విజయ్‌తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం విజయ్ మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తరువాత పంచ్ డైలాగ్స్‌తో విజయ్ ప్రసంగం కొనసాగింది.
Also Read : CM Vijay – Trisha : ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా త్రిషకు బిగ్ షాకిచ్చిన విజయ్.. ఆ రూమర్స్‌కు చెక్..!
విజయ్ పొలిటికల్ స్పీచ్‌లో 10 పంచ్ డైలాగ్స్..
♦ ప్రభుత్వంలో ఒకే పవర్ సెంటర్ ఉంటుంది. అది నేనే. అటో పవర్ సెంటర్, ఇటో పవర్ సెంటర్ ఉండదు
♦ ఇది కొత్త ఆరంభం. కొత్త శకానికి నాంది. సెక్యులర్, సోషల్ జస్టిస్ ప్రారంభమవుతుంది.
♦ ఈ విజయ్ ఎప్పుడూ తప్పు చేయడు. తప్పు చేయనివ్వడు. అది ఎవరైనా సరే.
♦ ప్రజల సొమ్ము పైసా కూడా తినను. నాకు డబ్బు అక్కర్లేదు.
♦ నేను ఏం చేసినా ధైర్యంగా, ఓపెన్ గా, పారదర్శకంగా చేస్తా.
♦ నేనెప్పుడూ మీకు తప్పుడు హామీలు ఇవ్వను. నెరవేర్చగలిగే హామీలే ఇస్తా.
♦ ఈ రోజు నుంచి డ్రగ్ కంట్రోల్ చేయడానికి యాక్షన్ స్టార్ట్ అవుతుంది.
♦ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా.
♦ కొందరు నన్ను విమర్శించొచ్చు. వాళ్లు నా ఫ్రెండ్స్ అవ్వొచ్చు. శత్రువులు అవ్వొచ్చు. కానీ 8కోట్ల మంది నా వాళ్లే.
♦ నేనేం పెద్ద దేవదూతని, ప్రవక్తని కాదు. నేను సాధారణ మనిషినే.
♦ నేనేం రాజకుటుంబం నుంచి రాలేదు. మీలో ఒకడినే.
♦ కోట్లాది మంది ప్రజలు నా పక్కన నిలబడితే దేన్నైనా సాధించగలననే నమ్మకం నాకుంది.
♦ రండి. అందరం కలసి తమిళనాడుకు ఒక కొత్త ప్రభుత్వాన్ని అందిద్దాం.
