Raghav Chadha : BJPలో చేరిన రాఘవ్ చద్దాకు భారీ షాక్.. వామ్మో ఒక్కసారే 10 లక్షలు ఔట్
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీని విడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు భారీ షాక్ తగిలింది.
- Dharani Pilli
- Updated on- April 25, 2026 / 04:44 PM IST
Raghav Chadha loses 1 million followers on instagram after BJP switch
- బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు భారీ షాక్
- 10 లక్షల మంది ఇన్ స్టా ఫాలోవర్లు డ్రాప్
- అన్ ఫాలో చేయలంటూ కామెంట్స్
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు, ప్రశ్నల తీరు తర్వాత రాఘవ్ చద్దాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ పెరిగింది. కానీ ఆయన ఆప్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడంతో.. భారీ షాక్ తగిలింది. పార్టీకి, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారంటూ కామెంట్స్ చేస్తూ.. చాలా మంది సోషల్ మీడియాలో ఆయనను అన్‌ఫాలో చేయసాగారు. ఇప్పటివరకు 10 లక్షల మంది ఆయనను అన్‌ఫాలో చేశారు. అతి తక్కువ కాలంలోనే ఆయన రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం గమనార్హం.
రాఘవ్ చద్దా బీజేపీలో చేరడంతో.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై ఆయనను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమేకాదు లక్షలాది మంది అన్‌ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాఘవ్ చద్దా పార్టీ మార్పు వార్త బయటకు రాగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆయనపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుంచి 1.37 కోట్లకు పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 80,000 పైగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని.. ఫేస్‌బుక్‌లో వేలమంది యూజర్లు ఆయనను అన్‌ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు.
నెటిజన్లు ఆయనను ఉద్దేశించి “హీరో టు జీరో”, “పంజాబ్ గద్దర్” (పంజాబ్ ద్రోహి), “అన్‌ఫాలో రాఘవ్ చద్దా” అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఫలితంగా 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయన్ను అన్‌ఫాలో చేశారు.
మొన్నటి వరకు కూడా రాఘవ్ చద్దాకు ప్రజల్లో భారీ అభిమానం ఉండేది. సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే ఇటీవల ఆయన మరో ఆరుగురు ఎంపీలతో కలిసి పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు.
