First Wedding Photo : భార్యాభర్తలుగా ఎంపీ రాఘవ్ చద్దా, పరిణితీ చోప్రాల ఫస్ట్ ఫొటో

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాల వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో వైభవంగా జరిగిన వివాహం అనంతరం రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా భార్యాభర్తలుగా మొట్టమొదటి చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు....

  • Updated on- September 25, 2023 / 05:38 AM IST

Raghav Chadha-Parineeti Chopra

First Wedding Photo : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాల వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో వైభవంగా జరిగిన వివాహం అనంతరం రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా భార్యాభర్తలుగా మొట్టమొదటి చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. (Raghav Chadha-Parineeti Chopra’s First photo) ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Nigeria : నైజీరియాలో గన్‌మెన్ కాల్పుల్లో 14 మంది మృతి

పెళ్లి అనంతరం పరిణీతి, రాఘవ జంట బహిరంగంగా కనిపించారు. పరిణీతి సిందూర్ పెట్టుకొని, పింక్ చీరలో మెరిసింది. రాఘవ్ బ్లాక్ సూట్ లో అందంగా కనిపించారు. పరిణీతి, రాఘవ్ చద్దాలు సెప్టెంబర్ 24న ఉదయపూర్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

Brahmani Nara : మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు- పోలీసులపై నారా బ్రాహ్మణి ఆగ్రహం

ఈ వివాహానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వరుడి పక్షం తాజ్ ప్యాలెస్‌లో ఉండగా, వధువు కుటుంబం లీలా ప్యాలెస్‌లో ఉంది. వరుడు పడవలో వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు బరాత్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు పూజలు, 6 గంటల ప్రాంతంలో విదైర్ కార్యక్రమాలు జరిగాయి.