కాంగ్రెస్ అల్టిమేట్ హామీ : రూ.72వేలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు

  • Publish Date - March 25, 2019 / 09:46 AM IST

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని సోమవారం(మార్చి-25,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని లెక్కలు పూర్తి అయినట్లు తెలిపారు.ఈ పథకం వివరాలను రాహుల్ ప్రకటించారు.దేశంలోని 20శాతం మంది అత్యంత పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం కింద.. ప్రతి ఏటా రూ.72వేలు వేస్తామని తెలిపారు.25కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ది పొందుతారని తెలిపారు.

ప్రపంచంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్న ఆయన ఆర్థికంగా ఇది సాధ్యమే అని తెలిపారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి నెలకు రూ.12వేలు ఆదాయం పొందేలా చేస్తామన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)ని తాము గతంలో సమర్థవంతంగా అమలుచేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు.దేశంలో పేదరికాన్ని పారదోలుతామన్నారు.ఇదొక చారిత్రక పథకం అని తెలిపారు.ఈ పథకం వివరాలు మీడియాకు వెల్లడించిన తర్వాత.. ఆశ్చర్యపోయారా అంటూ రాహుల్ ప్రశ్నించారు.తొలి విడత పోలింగ్ నామినేషన్లకు చివరి రోజు రాహుల్ ఈ చారిత్రక పథకం వివరాలను ప్రకటించారు.