Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే నా బలం.. ‘ఛత్రోన్ కీ గూంజ్’లో రాహుల్ హాట్ కామెంట్స్

భారతదేశంలోని 70 కోట్ల మంది మహిళలే తన అతిపెద్ద బలమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)స్పష్టం చేశారు.

Rahul gandhi pune speech women power 70 crore strength remarks

  • మహిళలే నా ప్రాథమిక బలం
  • స్త్రీలకు సొంత గుర్తింపు అవసరం
  • పురుషుల కంటే దూరదృష్టి ఎక్కువ

Rahul Gandhi: భారతదేశంలోని 70 కోట్ల మంది మహిళలే తన అతిపెద్ద బలమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)స్పష్టం చేశారు. పూణెలో నిర్వహించిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమానికి హాజరైన ఆయన మహిళా విద్యార్థులను ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా తమ సొంత కలలను సాకారం చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ సున్నితత్వం, సహనం, కరుణ మరియు భవిష్యత్తును సరిగ్గా అంచనా వేసే దూరదృష్టి ఉంటాయని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Heavy Rain Alert: మారుతున్న వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

మహిళల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి:

సమాజంలో మహిళలను కేవలం తల్లిగా, భార్యగా లేదా కూతురిగా మాత్రమే చూడడం సరైన పద్ధతి కాదని రాహుల్ పేర్కొన్నారు. కుటుంబ పాత్రలు ముఖ్యమే అయినప్పటికీ, మహిళకు స్వతంత్ర గుర్తింపు ఉండటం అంతే అవసరమని చెప్పారు. కేవలం కుటుంబ సంబంధాలకే వారి పరిధిని పరిమితం చేయడం వల్ల వారిలోని పూర్తి నైపుణ్యాలు వెలుగులోకి రాకుండా పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

స్వతంత్రంగా నిలబడాలని పిలుపు:

పురాతన మనుస్మృతి భావజాలం ప్రకారం మహిళలను ప్రతి దశలోనూ తండ్రి, భర్త లేదా కుమారుల నియంత్రణలోనే ఉంచాలనే ఆలోచన ఉందంటూ రాహుల్ విమర్శించారు. అలాంటి విధానాలు మహిళల స్వేచ్ఛకు విరుద్ధమని, తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా, తమపై తాము నమ్మకం ఉంచుకుని స్వయంసమృద్ధి సాధించాలని, సమాజంలో తమ సొంత కాళ్లపై నిలబడాలని రాహుల్ గాంధీ హితవు పలికారు.