Karnataka elections 2023: డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై రాహుల్ గాంధీ.. వీడియో
Karnataka elections 2023: రాహుల్ గాంధీ బెంగళూరులో ప్రచారంలో పాల్గొని స్థానికులు, డెలివరీ బాయ్ తో మాట్లాడారు.
- T Venkateshwarlu
- Published on- May 7, 2023 / 04:09 PM IST
Karnataka elections 2023
Karnataka elections 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇవాళ బెంగళూరులో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొని డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్ పై చక్కర్లు కొట్టారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అగ్న నేతలు అందరూ కర్ణాటకలోనే ఉంటున్నారు. రాహుల్ గాంధీ బెంగళూరులో ప్రచారంలో పాల్గొని స్థానికులు, డెలివరీ బాయ్ తో మాట్లాడారు. అనంతరం డెలివరీ బాయ్ స్కూటర్ పై ఎక్కి అతడితో కలిసి కొంత దూరం ప్రయాణించారు. ఆ సమయంలో రాహుల్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ కూడా ధరించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్థానికులు రాహుల్ తో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. రాహుల్ గాంధీ ఇప్పటికే పలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు.
కాగా, ప్రధాని మోదీ కూడా నిన్న 13 నియోజక వర్గాలు ప్రజలను తన సందేశాన్ని వినిపించేలా 26 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. ఆదివారం బెల్గావీ దక్షిణ నియోజక వర్గంలో కేంద్ర మంత్రి అమిత్ షా మెగా రోడ్ షో నిర్వహించి బీజేపీ తరఫున ప్రచారం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగుతాయి. మే 13న వాటి ఫలితాలు వస్తాయి.
Karnataka elections 2023: రాహుల్ గాంధీ భరోసాలు ఇస్తున్నారు.. మరి ఆయనకు..: అసోం సీఎం ఎద్దేవా
