Karnataka elections 2023: రాహుల్ గాంధీ భరోసాలు ఇస్తున్నారు.. మరి ఆయనకు..: అసోం సీఎం ఎద్దేవా

Karnataka elections 2023: రాహుల్ గాంధీకి చురకలు అంటిస్తూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పలు వ్యాఖ్యలు చేశారు.

Karnataka elections 2023: రాహుల్ గాంధీ భరోసాలు ఇస్తున్నారు.. మరి ఆయనకు..: అసోం సీఎం ఎద్దేవా

Himanta Biswa Sarma

Karnataka elections 2023: కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ రాష్ట్ర ప్రజలకు భరోసాలు ఇస్తున్నారని, మరి ఆయనకు భరోసా ఇచ్చేవారు ఎవరని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఎద్దేవా చేశారు.

ఈ నెల 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న వేళ ఇవాళ హిమంత బిశ్వ శర్మ ఆ రాష్ట్రంలోని మంగళూరులో పర్యటించి బీజేపీ తరఫున ప్రచారం చేశారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ గత 20 ఏళ్లుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీని రాజకీయాల్లో “నిలబెట్టడానికి” ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారని చురకలు అంటించారు.

అటువంటి వ్యక్తి ఇప్పుడు కర్ణాటకకు వచ్చి హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో సెల్ఫ్ గోల్ లా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరును ప్రతిబింబించేలా అది ఉందని విమర్శించారు. మెజారీటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. హిందువులపై కాంగ్రెస్ ద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని స్పష్టమైందని అన్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యులని హిమంత బిశ్వ శర్మ నిన్న వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi: ‘మీ నుంచి ఇది నేను ఊహించలేదు’.. సోనియా గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఒవైసీ