Rahul Gandhi: రాహుల్ గాంధీ మెడలో ప్రత్యేక హారం.. అసలేంటది? ఎందుకు ధరించారు? ప్రత్యేకత ఏంటి?
మెడలో ప్రత్యేక ఆభరణంతో రాహుల్ గాంధీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆ ఆర్నమెంట్ అట్రాక్ట్ చేసింది.
- Naveen
- Published On : March 13, 2026 / 12:21 AM IST
Representative Image (Image Credit To Original Source)
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల స్పెషల్ లుక్ లో కనిపించారు. ఆయన మెడలో ధరించిన ఆభరణం హైలైట్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు ఏంటా ఆర్నమెంట్? రాహుల్ గాంధీ ఎందుకు వేసుకున్నారు? ఆ ఆభరణం స్పెషాలిటీ ఏంటి..
Representative Image (Image Credit To Original Source)
రాహుల్ గాంధీ తన మెడలో ధరించిన ఆ ఆభరణం సాంప్రదాయ కోన్యాక్ నాగ ఆభరణం. అది నాగాలాండ్‌లోని కోన్యాక్ తెగకు చెందిన విలక్షణమైన ఆభరణం. రంగురంగుల పూసలు, సాంప్రదాయ అంశాలతో తయారైన ఈ ఆభరణాలు లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ ఆభరణం తెగ వారసత్వం, గుర్తింపునకు చిహ్నం. చారిత్రక వేడుకలు, సాంస్కృతిక సందర్భాలలో ఈ జువెలరీ ధరిస్తారు. ఇవి స్థితి, సంప్రదాయం, సమాజ గుర్తింపును ప్రతిబింబిస్తాయి. మెడలో ప్రత్యేక ఆభరణంతో రాహుల్ గాంధీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆ ఆర్నమెంట్ అట్రాక్ట్ చేసింది.
Lop in #LokSabha @RahulGandhi wears ‘Konyak Naga ornaments’ during the second part of #Budgetsession of #Parliament, in New Delhi, Thursday, March 12, 2026.@PTI_News #BudgetSession2026 #rahulgandhi pic.twitter.com/Zy6OyPIc5y
— Ravi Choudhary रवि चौधरी (@choudharyview) March 12, 2026
