Terror attack: పుల్వామాలో తీవ్రవాద దాడి.. రైల్వే పోలీసు మృతి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్‌పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.
- Narender Thiru
- Published On : April 18, 2022 / 08:44 PM IST
Terror Attack
Pulwama: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాదుల దాడిలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్‌పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామాలోని కాకపొరా ప్రాంతంలో సోమవారం ఒక టీ స్టాల్ దగ్గర విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్ జవాన్లపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించగా ఒక జవాను మరణించాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
Jammu and Kashmir : కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. LeT కమాండర్ హతం
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయలో తీవ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఈ నెలలోనే ఇది తొమ్మిదవ దాడి కావడం గమనార్హం. ఈ ఘటనల్ని నివారించేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సాయం కోరుతున్నారు. దీని ద్వారా బయోమెట్రిక్ ఐడీని పరిశీలించి, తీవ్రవాదుల్ని గుర్తించే వీలుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పాకిస్తానీలు ఫేక్ ఆధార్ కార్డులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అరికట్టేందుకు సరికొత్త మెకానిజాన్ని పోలీసులు రూపొందిస్తున్నారు.
