Raja Singh remarks: మీవాళ్లను అదుపులో ఉంచండి.. బీజేపీకి మాయావతి హెచ్చరిక
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల దేశంలో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారనేలేదు. అప్పుడే బీజేపీకి చెందిన మరో నేత, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అదే తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయి. రాజాసింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటికీ.. దేశంలో శాంతి, ప్రశాంతతను కాపాడే బాధ్యత బీజేపీకే ఉంది.
- tony bekkal
- Published on- August 23, 2022 / 04:23 PM IST
mayawati fires on rajasingh over prophet remarks
Raja Singh remarks: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజాసింగ్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె విమర్శించారు. రాజాసింగ్ అరెస్ట్ అనంతరం తన ట్విట్ట్ ద్వారా స్పందిస్తూ బీజేపీ తన నేతల్ని అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు.
‘‘మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల దేశంలో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారనేలేదు. అప్పుడే బీజేపీకి చెందిన మరో నేత, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అదే తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయి. రాజాసింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటికీ.. దేశంలో శాంతి, ప్రశాంతతను కాపాడే బాధ్యత బీజేపీకే ఉంది. తమ నేతలను, కార్యకర్తలను అదుపులో పెట్టకోకపోతే విదేశాల్లో భారత్ ప్రతిష్ట తగ్గడమే కాకుండా విదేశాల్లో నివసించే భారతీయులకు కొత్త కష్టాలు పని కట్టుకొని వస్తాయి’’ అని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. వివిధ అంశాల్లో పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను సస్పెన్షన్ వేటు వేసినట్లు బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ప్రకటించింది. పార్టీ నియమావళి రూల్ XXV10 (ఎ) ప్రకారం రాజాసింగ్‌ను సస్పెండ్ చేసినట్లు కేంద్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ సెక్రటరీ ఓం పాతక్ ప్రకటించారు. దీనిపై తదుపరి విచారణ పెండింగ్‌లో ఉందని, అప్పటివరకు పార్టీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో రాజాసింగ్ తెలపాలని, ఇందుకోసం పది రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోగా సమాధానం చెప్పాలని పార్టీ ఆదేశించింది.
Bilkis Bano: బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదలపై సుప్రీకోర్టులో పిల్
