Bilkis Bano: బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదలపై సుప్రీకోర్టులో పిల్

బిల్కిస్ బానో కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలను వ్యతిరేకిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Bilkis Bano: బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదలపై సుప్రీకోర్టులో పిల్

Bilkis Bano: బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతోపాటు, ఆమె కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో నిందితులను ఇటీవల గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15న, మొత్తం 11 మంది నిందితులను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.

Raja Singh: పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

అయితే, తాజాగా నిందితుల విడుదలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సుభాషిని అలీ, రేవతి లాల్, రూప్ రేఖా వర్మ అనే న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టులో పిల్ దాఖదు చేశారు. అత్యాచారం, హత్యకు పాల్పడ్డ నిందితులను విడుదల చేయకూడదని ఈ పిల్‌లో కోరారు. నిందితులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, మరో న్యాయవాది అపర్ణా భట్ కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ముందు ఈ కేసును ప్రస్తావించారు. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేశారు. ఈ కేసు విచారణకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది.

Ramyakrishna Latest photoshoot : లేటు వయసులో.. చీరలో రమ్యకృష్ణ ఘాటు ఫోజులు..

ఇంతకుముందు దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. నిందితుల విడుదలను రద్దు చేయాలని సుప్రీం కోర్టును కోరారు. మార్చి 2003లో బిల్కిస్ బానోపై నిందితులు అత్యాచారం చేశారు. ఆమె మూడేళ్ల కూతురుతోపాటు, ఇతర కుటుంబ సభ్యులను కూడా హతమార్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే, తాజాగా సత్ప్రవర్తన కింద 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.