Rajasthan : అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. భవనం పైపెచ్చులూడి పడటంతో.. వీడియో వైరల్..

Government Hospital Celling Collapses : రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా సుజన్‌గఢ్‌లోని ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది.

Government Hospital Celling Collapses

Government Hospital Celling Collapses : రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా సుజన్‌గఢ్‌లోని ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రాణాలతో ఆమె బయటపడింది. ఆస్పత్రి ప్రధాన ద్వారా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మహిళపై స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర్ అయింది.

Also Read : Liquor Price Hike : మందు బాబులకు బిగ్ అలర్ట్.. మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయ్.. కారణాలివే? ఎంత శాతం పెరుగుతాయంటే?

ప్రభుత్వ ఆస్పత్రి సీలింగ్ పెచ్చులూడి మహిళపై పడటంతో ఆమె ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయింది. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పక్కకు వచ్చేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ బగాడియా సబ్ డిస్ట్రిక్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ బన్షీధర్ మాట్లాడుతూ… శిథిలావస్థకు చేరిన పాత భవనం గురించి అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.