Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…
సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.....
- saleem sk
- Published On : November 3, 2023 / 05:09 AM IST
cobra
Cobra : సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరానికి చెందిన బాబూలాల్ మరాండీ బయట నుంచి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంతే సోఫాలో నుంచి హిస్సింగ్ శబ్ధం వస్తుండటంతో అటు చూసిన బాబూలాల్ భయంకరమైన నాగుపామును చూసి షాక్ అయ్యారు.
Also Read : Skill Development Scam : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ లపై ఫిర్యాదు
5 మీటర్ల పొడవు ఉన్న పెద్ద నాగుపామును చూసిన బాబూలాల్ తోపాటు అతని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో వారు హెర్పెటాలజిస్ట్ గోవింద్ శర్మను పిలిచారు. ఆయన వచ్చి నాగుపామును సోఫాలో నుంచి బయటకు తీసి పట్టుకున్నాడు. సోఫాలో దొరికిన నాగుపామును సమీపంలోని లాడ్ పురా అడవిలో వదిలేశారు. దీంతో బాబూలాల్ కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Kasani Gnaneshwar : బీఆర్ఎస్ లో చేరనున్న కాసాని.. గోశామహల్ నుంచి పోటీ?
