Rajinikanth : కమల్, విజయ్‌పై రజనీకాంత్ సంచలన కామెంట్స్.. అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను
Rajinikanth : తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ కావడంపై రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడు. స్నేహపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Updated on- May 17, 2026 / 12:35 PM IST
Rajinikanth
Rajinikanth : తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, విజయ్ సీఎం కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన మాజీ సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారని తమిళ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. తాజాగా.. ఈ అంశంపై రజనీకాంత్ స్పందించారు. ఈ క్రమంలో సీఎం విజయ్, కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Jihadi Drug : దేశంలో ఫస్ట్ టైమ్ ‘జిహాదీ డ్రగ్’.. ఏంటిది? దీన్ని తీసుకుంటే ఏమవుతుంది..
చెన్నైలో ఆదివారం రజనీకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నటుడు విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటూ రజనీకాంత్ పేర్కొన్నారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని, విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని, అన్ని పార్టీల్లోనూ తనకు అభిమానులుంటారని రజనీకాంత్ పేర్కొన్నారు. తాను పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడినని, అయితే, ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.
తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ కావడంపై రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడు. స్నేహపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. విజయ్ సీఎం కావడం సంతోషంగా ఉంది. కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడతానని చమత్కరించారు. విజయ్ తనకు సమవుజ్జీ అనుకోవడం లేదని, ఆయనకు నాకు 25ఏళ్లు వయస్సు తేడా ఉంటుందని తెలిపారు. అయితే, రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
