మెడకు వైర్ చుట్టుకుని విలవిల్లాడుతూ ఆర్తనాదాలు చేసిన పులి

రంతంబోర్ టైగర్ రిజర్వ్ లో పులి మెడకు వైర్ చుట్టుకుని ఉన్న విషయం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వైరుతోనే భయంకరంగా గాండ్రిస్తూ తిరుగుతున్నట్లు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. టీ-108 మెడకు ఉన్న వైర్ ను శనివారమే తొలగించాం. ఈ విషయంపై మళ్లీ ఎంక్వైరీ వేస్తామని అధికారులు అంటున్నారు.
శనివారం రెండు కెమెరాల్లో ఈ ఫొటోలు రికార్డు అయ్యాయి. ఒకటి శుక్రవారం ఉదయం, మరొకటి అంతకు ముందు రోజు చుట్టుకుని ఉంది. ఈ విషయంపై అలర్ట్ గానే ఉన్నాం. అక్కడి ఫీల్డ్ డైరక్టర్ తో కాంటాక్ట్ అయ్యాం. పులికి ఆ వైర్ ను తొలగించడానికి పర్మిషన్ తీసుకున్నాం’ అని అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టెస్ అరిజిత్ బెనర్జీ చెప్పారు.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి పులికి ఆ బాధ తప్పించాలని బెనర్జీ పర్మిషన్ తీసుకున్నారట.
‘రంతంబోర్ ఫీల్డ్ డైరక్టర్ ను అడిగి ఈ రోజు ఉదయం వైర్ తొలగించాం. ఎటువంటి ఫిజికల్ గాయాలు జరగలేదు. ఈ విషయంపై ఎంక్వైరీ చేయాలని ఇష్యూ చేశాం. ఘటనపై రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించాం. అటవీ ప్రాంతం బయటాలోపల పాట్రోలింగ్ నిర్వహించాం. ఎమర్జెన్సీ అవసరాలు తప్పించి మరెవ్వరికీ సెలవులు ఇవ్వడం లేదు’ అని అధికారి వివరించారు.
ప్రిలిమినరీ విచారణలో అది లూజ్ గా ఉన్నట్లు తెలిసింది. అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులను వేటాడకూడదని ఆంక్షలు విధించినా కొందరు లెక్కచేయకుండా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడుతున్నారు. ఎంక్వైరీ వేశాం త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని బెనర్జీ అన్నారు.