Hyderabad Rci : హైద్రాబాద్ ఆర్ సీ ఐలో అప్రెంటిస్ ల భర్తీ
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 8,000 రూ నుండి 9,000రూ వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు జనవరి 1 , 2022 నాటికి 18 ఏళ్లు ఉండాలి. అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : January 24, 2022 / 04:37 PM IST
Rci Drdo
Hyderabad Rci : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని డీఆర్డీఓ రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సీఐ) లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీ భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 150 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న అప్రెంటిస్ ఖాళీల్లో గ్రాడ్యుయేట్ అప్పెంటిస్ 40 ఖాళీలు, టెక్నీషియన్ డిప్లోమా అప్రెంటిస్ లు 60 ఖాళీలు, ట్రేడ్ అప్రెంటిస్ లు 50 ఖాళీలు ఉన్నాయి.
ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానికి్, వెల్డర్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ తదితర విభాగాల్లో ఈ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, బీకాం, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 8,000 రూ నుండి 9,000రూ వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు జనవరి 1 , 2022 నాటికి 18 ఏళ్లు ఉండాలి. అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.drdo.gov.in
