Divorce Celebrations: కూతురికి విడాకులు.. కోర్టు బయట బ్యాండ్ బాజా బారాత్.. జడ్జి డ్యాన్సులు..

కోర్టు నుంచి కూతురిని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో పేరెంట్స్ ఇలా వేడుక చేసుకున్నారు. వినీత తండ్రి రిటైర్డ్ జడ్జి. తన కూతురికి విడాకులు మంజూరు కావడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు.

  • Published On : April 5, 2026 / 05:32 PM IST

Divorce Celebrations: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో ఆసక్తికరమైన, భిన్నమైన ఘటన చోటు చేసుకుంది. విడాకులు అంటే బాధ పడటం కామన్. తమ పిల్లలు డైవర్స్ తీసుకున్నారంటే పేరెంట్స్ ఎంతో బాధపడతారు. తమ కొడుకు లేదా కూతురు జీవితం ఇలా అయ్యిందేంటని ఆవేదన చెందుతారు. అయితే, ఇందుకు భిన్నమైన ఇన్సిడెంట్ యూపీలోని మీరట్ లో జరిగింది. కూతురికి విడాకులు మంజూరు కావడంతో ఆమె తల్లిదండ్రులు బాధపడలేదు. సరికదా ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాదు దీనొక వేడుకలా జరుపుకున్నారు. డ్యాన్సులు కూడా చేశారు.

మీరట్ కు చెందిన మహిళకు విడాకులు మంజూరయ్యాయి. కూతురి డైవర్స్‌ను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వేడుకలా జరుపుకున్నారు. ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సందర్భంగా కోర్టు బయట బ్యాండ్ బాజా బారాత్ నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్స్ చేస్తూ కూతురిని ఇంటికి తీసుకెళ్లారు. ‘ఐ లవ్ మై డాటర్.. మై హార్ట్ అండ్ సోల్’ అని రాసి ఉన్న టీషర్టులు ధరించి మరీ తల్లిదండ్రులు, ఆమె కుటుంబసభ్యులు వేడుక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్ కమ్..

ఆ మహిళ పేరు ప్రతీక్ష. మీరట్‌లోని శాస్త్రి నగర్‌లో నివసిస్తుంది. ఆమెకు 2018లో షాజహాన్‌పూర్‌కు చెందిన మేజర్ గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంత కాలం కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ గొడవల వ్యవహారం విడాకులు తీసుకునే వరకు వెళ్లింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఏప్రిల్ 4న ఆ జంటకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరు కావడంతో ప్రతీక్షకు ఆమె తండ్రి ఘనంగా స్వాగతం పలికారు. డప్పులు వాయించారు. కుటుంబ సభ్యులు నృత్యం చేశారు. ఆమెపై పూల వర్షం కురిపించారు.

కోర్టు నుంచి కూతురిని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో పేరెంట్స్ ఇలా వేడుక చేసుకున్నారు. వినీత తండ్రి రిటైర్డ్ జడ్జి. తన కూతురికి విడాకులు మంజూరు కావడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు. కూతురి ఆనందం కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదన్నారు. ఆమె సంతోషమే అన్నింటికన్నా ముఖ్యం అని గర్వపడుతూ చెప్పారాయన. తన కుమార్తె విడాకులను ఒక ఎదురుదెబ్బగా కాకుండా ఒక కొత్త ప్రారంభంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

కూతురి డైవర్స్ ను పేరెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది సాహసోపేతమైన చర్య అని, పాత సామాజిక కట్టుబాట్లను సవాల్ చేస్తూ, సమాజపు అంచనాల కన్నా కూతురి శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తోందని కామెంట్ చేశారు. ఈ సమయంలో కూతురికి అండగా నిలిచిన తల్లిదండ్రులపౌ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

విడాకుల తర్వాత కుమార్తె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు తీవ్రమైన దుఃఖానికి లోనవుతారు. అందుకు భిన్నంగా వారు దీన్ని వేడుకలా జరుపుకోవడం విశేషం. తల్లిదండ్రులు చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది.

Also Read: పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆధార్ ఉన్నా PAN ఇవ్వరు.. ఈ గైడ్‌లైన్స్ తెలియకపోతే నష్టపోయేది మీరే..!