Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌లో మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా..

Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది.

Road Accident

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ట్రక్కును ఢీకొట్టిన పెండ్లి బృందం బస్సు
  • స్పాట్‌లో ఆరుగురు మృతి.. ఏడుగురికి గాయాలు

Road Accident : పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బస్సు వేగంగా దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read : Hyderabad : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకండి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పటివరకు అంటే? ఫుల్ డీటెయిల్స్ ఇవే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా – గులావతి రహదారిపై పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు హాపుర్ ఎస్పీ జ్ఞానంజయ్ తెలిపారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ట్రక్కును తొలగించి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద ఘటనపై బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ధౌలానా – గులావతి రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసులు కొద్దిసేపటికి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.