×
Ad

Somanath : ఇస్రో ఛైర్మన్ గా ఎస్.సోమనాథ్ నియామకం

తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు.

  • Published On : January 12, 2022 / 09:15 PM IST

Somanath

ISRO new chairman S Somnath : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్ గా అంతరిక్ష శాఖ కార్యదర్శి రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియామించారు.

తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు.

TTD : వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల

కేరళకు చెందిన ఎస్.సోమనాథ్.. కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో యూజీ డిగ్రీ, భారతదేశం ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1985లో సోమనాథ్ ఇస్రోలో చేరారు.

కేరళ శాస్త్రవేత్తలు జి.మాధవన్ నాయర్, డాక్టర్ కె.రాధాకృష్ణన్ 2003 నుంచి 2014వరకు అంతిరక్ష సంస్థకు నాయకత్వం వహించారు. ఎస్.సోమనాథ్.. అగ్రస్థానికి చేరుకున్న మూడో మలయాళీ కావడం విశేషం.