TTD : వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల

శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు...

TTD : వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల

Ttd

Vaikunta Dwara Darshanam : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వైకుంఠాన్ని తలపిస్తోంది. వెంకటేశ్వర నామ స్మరణతో తిరుమల మారుమ్రోగుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు.రెండు కళ్లు చాలవన్నట్లుగా పుష్పాలతో ముస్తాబు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు.

Read More : New Traffic Fines : GHMC వాహనాలపై భారీగా చలాన్లు

ఆలయ అర్చకులు. అనంతరం నిత్యసేవలను కొనసాగించనున్నారు. వేకువజామున 1.40 గంటలకు వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం ప్రారంభం కానుంది. కోవిడ్ మార్గదర్శకాల అనుగుణంగా..భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. స్వయంగా వచ్చిన వీఐపీలకు దర్శనం, వసతి ఏర్పాట్లకు శ్రీ పద్మావతి అతిథి గృహం పరిధిలోని వెంకటకళా, రామ్ రాజ్, సీతా, గోవింద్ సాయి, సన్నిదానం అతిధి గృహాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read More : Cinema Ticket Rates : కరెంట్ రేట్ తగ్గిస్తే .. టిక్కెట్ల ధరలు తగ్గిస్తాం..!

2022, జనవరి 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వర్ణ రధంపై స్వామి వారిని ఊరేగించనున్నారు. ఎల్లుండి ద్వాదశి రోజున ఉదయం 5 నుండి 6 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ లేదా వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని ఈవో సూచించారు.