పులి నుంచి తప్పించుకున్నాడు..వీడియో వైరల్
- madhu
- Updated on- November 25, 2020 / 11:07 AM IST
Royal Bengal tiger roams free in Tezpur : వెనుక నుంచి వస్తున్న పులి..తప్పించుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నం. అటు ఇటు పరుగెత్తాడు..అంతే స్పీడుగా పులి పరుగులు.. ఇక నా ప్రాణాలు పోయాయి.. అనుకుంటున్న తరుణంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ పులి బారి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తేజ్ పూర్ సమీపంలోని Kaziranga National Park ఓ పులి వచ్చింది. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పులిని తరుముదామని కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేశారు. అవి బెడిసి కొట్టాయి. ఒక్కసారిగా వారిపైకి దూకింది. వామ్మో..అంటూ తలో దిక్కున పరుగులు తీశారు. కానీ..ఓ వ్యక్తి వెంట..పులి తరిమింది. దాని నుంచి కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు.
పంజాతో కొట్టినంత పని చేసింది. ఆ వ్యక్తి పరుగులు తీస్తూ..అమాంతం ఓ గోతిలో దూకేశాడు. పులి కూడా అతనితో పాటు..దూకింది. కానీ…ఏమైందో ఏమో కానీ…ఇసుక దిబ్బలనెక్కి..సమీపంలో ఉన్న చెట్లలోకి మాయమైంది. బతుకు జీవుడా..అంటూ ఆ రైతు లేచాడు. దీనికి సంబంధించిన వీడియోను M Firoz Ahmed ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పులిని పట్టుకోవడానికి అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.
https://10tv.in/sonu-sood-beats-bollywood-stars-in-twitter/
