Girl Apology To PM Modi : ‘నాకు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పిన బాలిక.. వీడియో వైరల్

Ruchika Singh Apology To PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బాలిక క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. నాకు కేవలం 15ఏళ్లే నన్ను క్షమించండి.. అంటూ ఆ వీడియోలో కోరింది.

Ruchika Singh Apology To PM Modi

Ruchika Singh Apology To PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బాలిక క్షమాపణలు చెప్పింది. నాకు కేవలం 15ఏళ్లే నన్ను క్షమించండి.. నేను చేసింది నా మొదటి, చివరి తప్పు అంటూ ఆమె మోదీని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Anna Konidala : భర్తను ఫాలో అయిన భార్య.. పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల మంచిమనుసు..

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నోయిడాకు చెందిన రుచికా సింగ్ అనే యువతి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్‌ స్టేషన్‌లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో ఈ కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. అయితే, తాజాగా.. రుచికా సింగ్ మోదీకి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో చేతులు జోడించి మాట్లాడుతూ.. “నాకు కేవలం 15 ఏళ్లే. నన్ను క్షమించండి. నేను చేసినది నా మొదటి, చివరి తప్పు” అని ఆమె పేర్కొంది. అలాగే తన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పింది.

బాలిక మాట్లాడుతూ.. తాను కొందరి ప్రభావానికిలోనై ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపింది. ఆ సమయంలో పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేకపోయానని, ఇకపై అలాంటి తప్పు ఎప్పటికీ చేయనని హామీ ఇచ్చింది. వైరల్ వీడియోను తాను స్వయంగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది. ఈ ఘటనపై తొలుత నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వయస్సు 25 సంవత్సరాలుగా పేర్కొనగా, క్షమాపణ వీడియోలో మాత్రం తాను 15 ఏళ్ల మైనర్ బాలికను అని చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఆమె అసలు వయస్సుపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


ఈ వివాదంపై మోదీ స్పందించారు. ఓ వీడియోలో మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ.. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.