Sangeetha Joins BJP : బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత.. అబ్బో ఇది మాములు ట్విస్ట్ కాదు భయ్యా..!
Sangeetha Joins BJP : తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.
- Dharani Pilli
- Updated on- May 30, 2026 / 05:12 PM IST
rumors alleged that tamil nadu cm tvk vijay wife sangeetha joins in bjp
- తమిళ నాట ఆసక్తికర చర్చ
- బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత
- త్వరలోనే చేరికపై ప్రకటన అంటూ ప్రచారం
Sangeetha Joins BJP : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే విజయ్ కి త్వరలోనే భారీ షాక్ తగలబోతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. కారణం విజయ్ భార్య సంగీత సోర్నలింగం త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ తమిళనాట బలంగా ప్రచారం అవుతోంది. ఎన్నికలకు ముందు నుంచే విజయ్, సంగీత మధ్య విభేదాలు తెర మీదకు వచ్చాయి. అతడికి త్రిషతో సంబంధం ఉందని.. ఆ కారణంగానే సంగీత విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చివరకు అవి నిజమే అని తెలిసాయి. విజయ్ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ కనీసం ఆయన పిల్లలు కూడా వేదిక వద్ద కనిపించలేదు. తండ్రికి అభినందనలు తెలపలేదు. అదే రోజు త్రిష తీరు నెట్టింట భారీ స్థాయిలో విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంచితే ఇప్పటికే సంగీత-విజయ్ ల మధ్య విభేదాలను దృష్టిలో పెట్టుకుని.. విజయ్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే వ్యూహంలో భాగంగా.. సంగీతను కాషాయ పార్టీలో చేర్చుకోబోతున్నారని సమాచారం. బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ నాయకురాలు సంగీతను పార్టీలోకి తీసుకురావడానికి తెరవెనుక గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. విజయ్ కి ఇబ్బందులు తప్పవని.. ప్రత్యక్షంగా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. బీజేపీ పార్టీ సంగీతను ముందు పెట్టి విజయ్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
*విజయ్ డివోర్స్ కేసు.. 250 కోట్లతో క్లోజ్ చేయాలనుకుంటున్నాడా?
ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా విజయ్, సంగీతల మధ్య దూరం పెరిగిందని.. నటి త్రిషతో విజయ్ కు ఉన్న సాన్నిహిత్యంపై సంగీత అభ్యంతరం తెలపడం, విడాకులకు దరఖాస్తు చేయడం, పైగా అందుకు ఆమె భారీగా భరణం కోరడం వంటి కథనాలు గతంలో తమిళ మీడియాలో హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం సంగీత తన పిల్లలతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు.
ఎన్నికల ముందు ఈ వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఈ వ్యక్తిగత వివాదాల ప్రభావం ఎన్నికలపై పడుతుందని భావించినా, ప్రజలు విజయ్‌కే పట్టం కట్టారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు హాజరుకాకపోవడం గమనార్హం. విజయ్ ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిపై అటు బీజేపీ, ఇటు సంగీత ఎవరూ స్పందించలేదు.
*విజయ్ కి షాక్ ఇచ్చిన కొడుకు.. తండ్రి పేరును తొలగించిన జాసన్ సంజయ్.. తల్లికి సపోర్ట్ గానే
శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబానికి చెందిన సంగీత, లండన్‌లో స్థిరపడ్డారు. విజయ్‌కు అభిమాని అయిన ఆమె, 1999లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషా ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి సంగీత విదేశాల్లో ఉంటున్నారు.
