Sachin Tendulkar: మాజీ స్టార్ ప్లేయర్లతో విమానంలో సచిన్.. అభిమానుల్ని ఏం అడిగాడో తెలుసా!
మాజీ స్టార్ క్రికెటర్లతో కలిసి విమానంలో వెళ్తున్న ఫొటోను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలో సచిన్ పక్కనే యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా అభిమానుల్ని ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
- Narender Thiru
- Published On : September 16, 2022 / 06:22 PM IST
Sachin Tendulkar: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సచిన్ టెండూల్కర్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్లతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్
ఈ ఫొటోలో సచిన్ పక్కనే యువరాజ్ సింగ్, వెనకాల బ్రెట్ లీతోపాటు షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ వంటి పలువురు ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నారు. ఈ సందర్భంగా సచిన్.. క్రీడాభిమానులను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఆ ఫొటోలో మొత్తం ఎన్ని పరుగులు, ఎన్ని వికెట్లు ఉన్నాయో చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు. అంటే విమానంలో ఉన్న మొత్తం బౌలర్లు తీసిన వికెట్లు, బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు ఎన్నో చెప్పాలంటూ అభిమానుల్ని అడిగాడు. దీనికి అభిమానులు ‘ఇన్ఫినిటీ (అనంతం)’ అంటూ బదులిస్తున్నారు. ఇంతకీ సచిన్ ఇతర ఆటగాళ్లతో కలిసి విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నారు అనుకుంటున్నారా! ప్రస్తుతం ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ జరుగుతున్న సంగతి తెలిసిందే.
మాజీ స్టార్ క్రికెట్ ప్లేయర్లందరూ కలిసి ఈ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ఈ నెల 10న కాన్పూర్ వేదికగా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇందులో ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి. వచ్చే నెల వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇప్పటికే జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం సాధించింది. ‘ఇండియన్ లెజెండ్ టీమ్’గా పిలుస్తున్న భారత జట్టుకు సచిన్ నాయకత్వం వహిస్తున్నాడు. మన టీమ్‌లో సచిన్ టెండూల్కర్‌తోపాటు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ బద్రినాథ్, నమన్ ఓఝా, మన్‌ప్రీత్ గోనీ, ప్రగ్యాన్ ఓఝా, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్ ఉన్నారు.
Can you tell me the number of international runs and wickets in these pictures? ✈️ ? ? #CricketTwitter pic.twitter.com/EGednbOUkC
— Sachin Tendulkar (@sachin_rt) September 15, 2022
