Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది.

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

Updated On : September 16, 2022 / 5:38 PM IST

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్న పింపాల్ గావ్ అనే టోల్ ప్లాజా దగ్గర జరిగింది.

First Flying Bike: మొదటి ఫ్లైయింగ్ బైక్.. ఎలా ఎగురుతుందో చూడండి.. మార్కెట్లోకి వస్తుందా?

టోల్ ప్లాజా నుంచి ఒక వాహనంలో వెళ్తున్న మహిళకు, అక్కడ పని చేస్తున్న మరో మహిళకు మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఇది పెద్ద గొడవగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జట్టు పట్టి లాగుతూ, తిట్టుకుంటూ ఇరువురూ దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్న వాళ్లు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు చాలా సేపటి తర్వాత మిగతా వాళ్లు జోక్యం చేసుకుని, ఇద్దరినీ విడిపించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు.

Guatemala: గ్వాటెమాలా స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొక్కిసలాట.. 9 మంది మృతి

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ, వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.