First Flying Bike: మొదటి ఫ్లైయింగ్ బైక్.. ఎలా ఎగురుతుందో చూడండి.. మార్కెట్లోకి వస్తుందా?

గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది అమెరికాకు చెందిన ఒక సంస్థ. ఇటీవల ఈ బైక్‌ను అమెరికాలో జరిగిన ఒక ఆటో షోలో ప్రదర్శించారు. వచ్చే ఏడాది అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. దీని ధర మాత్రం చాలా ఎక్కువ.

First Flying Bike: మొదటి ఫ్లైయింగ్ బైక్.. ఎలా ఎగురుతుందో చూడండి.. మార్కెట్లోకి వస్తుందా?

First Flying Bike: బైకులు కూడా గాల్లో ఎగిరితే బాగుంటుంది కదూ! ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చు. త్వరలో ఈ కోరిక నిజం కాబోతుంది. ఎందుకంటే అమెరికాకు చెందిన ఒక సంస్థ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది.

Gautam Adani the world’s second richest man: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్‌ అదానీ

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్. దీని పేరు ఎక్స్‌టీయూఆర్ఐఎస్‌ఎమ్ఓ. ఈ బైకును అక్కడ మీడియాకు ప్రదర్శించారు. అమెరికాకు చెందిన ఒక టెక్నాలజీ సంస్థ ఈ బైకును తయారు చేసింది. ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన నార్త్ అమెరికన్ ఆటో షోలో ఈ బైకును ఆ సంస్థ ప్రదర్శించింది. ఈ హోవర్ బైక్ 40 నిమిషాలపాటు గాల్లో ఎగరగలిగే సామర్ధ్యం కలిగి ఉంది. ఈ బైకు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది.

Anantapur: అనంతపురంలో ఉత్తుత్తి బ్యాంక్.. నకిలీ బ్యాంక్ ఏర్పాటు చేసి లక్షల్లో వసూలు

ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ.6 కోట్లకు పైనే ధర ఉండొచ్చు. కానీ, 2025కల్లా ధర తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌ను అమెరికా ప్రభుత్వం నాన్-ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్‌గా పరిగణిస్తుందని కంపెనీ భావిస్తోంది.