Gautam Adani the world’s second richest man: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్‌ అదానీ

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్నారు. సంపద విలువలో ఫ్రాన్స్‌కు చెందిన పారిశ్రామికవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ అదానీ రెండో స్థాానానికి చేరుకోవడం గమనార్హం. తాజాగా విడుదలైన ‘ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్స్’ జాబితా ద్వారా ఈ వివరాలు తెలిశాయి. గౌతమ్‌ అదానీ సంపద ప్రస్తుతం రూ.12.37 లక్షల కోట్ల (155.5 బిలియన్ డాలర్లు) కు చేరింది. గతంలో విడుదల చేసిన జాబితా కన్నా ఇప్పుడు అదానీ నికర విలువ 5.2 బిలియన్ డాలర్లు (3.49 శాతం) పెరిగింది. ఇక ఈ జాబితాలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ మళ్ళీ అగ్రస్థానంలోనే నిలిచారు.

Gautam Adani the world’s second richest man: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్‌ అదానీ
ad

Gautam Adani the world’s second richest man: అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్నారు. సంపద విలువలో ఫ్రాన్స్‌కు చెందిన పారిశ్రామికవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌, అమెరికాకు చెందిన అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ అదానీ రెండో స్థాానానికి చేరుకోవడం గమనార్హం. తాజాగా విడుదలైన ‘ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్స్’ జాబితా ద్వారా ఈ వివరాలు తెలిశాయి.

గౌతమ్‌ అదానీ సంపద ప్రస్తుతం రూ.12.37 లక్షల కోట్ల (155.5 బిలియన్ డాలర్లు) కు చేరింది. గతంలో విడుదల చేసిన జాబితా కన్నా ఇప్పుడు అదానీ నికర విలువ 5.2 బిలియన్ డాలర్లు (3.49 శాతం) పెరిగింది. ఇక ఈ జాబితాలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ మళ్ళీ అగ్రస్థానంలోనే నిలిచారు. ఇక ఈ సారి ఈ జాబితాలో టాప్-10లో భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కూడా రూ.7.35 లక్షల కోట్ల నిరక విలువతో చోటు సంపాదించుకున్నారు.

టాప్-10లో బిల్ గేట్స్, లారీ ఎలిసన్‌, వారెన్‌ బఫెట్‌, లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ ఉన్నారు. కాగా, కాలేజీ చదువును మానేసి అదానీ అప్పట్లో వజ్రాల వ్యాపారం చేశారు. అనంతరం బొగ్గు వ్యాపారిగా మారారు. ఆయన వ్యాపార రంగం నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుదుత్పత్తి, సిమెంటు తయారీ వంటి రంగాలకు విస్తరించింది. ఆయన సంపద విలువను అమాంతం పెరిగిపోతూ వస్తోంది. ప్రస్తుతంఆసియాలోనే అత్యంత సంపన్నుడిగానూ అదానీ ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో దిగ్గజాలను వెనకేసుకుంటూ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నారు.

Forbes’ Real-Time Billionaires List
అత్యంత సంపదకలిగిన తొలి 10 మంది

ర్యాంకు-నికర విలువ (బిలియన్ డాలర్లలో)
1. ఎలాన్ మస్క్ 273.5
2. గౌతం అదానీ & కుటుంబం 155.5
3. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ & కుటుంబం 155.2
4. జెఫ్‌ బెజోస్‌ 149.7
5. బిల్ గేట్స్ 105.3
6. లారీ ఎలిసన్‌ 98.3
7. వారెన్‌ బఫెట్‌ 96.5
8. ముకేశ్ అంబానీ 92.3
9. లారీ పేజ్‌ 89.0
10. సెర్గీ బ్రిన్‌ 85.4

Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు.. నిన్న కోలుకున్న 5,916 మంది