Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకు కొవిడ్ పాజిటివ్
లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా తేలింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ ఎంపీకి కొవిడ్ పాజిటివ్ అని స్వయంగా..
- Subhan Ali Shaik
- Published On : January 31, 2022 / 03:14 PM IST
Pragya Thakur
Sadhvi Pragya: లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా తేలింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ ఎంపీకి కొవిడ్ పాజిటివ్ అని స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా, కాంటాక్ట్ లో ఉన్న వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభం కావడానికి కొద్ది గంటల ముందే ఆమె అనౌన్స్ మెంట్ చేశారు.
‘ఇవాల్టి నా కరోనా రిపోర్ట్ లో పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. నాతో రెండ్రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలర్ట్ గా ఉండాలని అవసరమైతే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నా. మీ క్షేమాన్ని కోరుకుంటూ..’ అని ముగించారు.
కరోనావైరస్ ఆంక్షల నడుమే పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభమైంది.
