Santiniketan Unesco
Santiniketan Unesco : భారతదేశపు జాతీయ గీతకర్త,నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత సాహిత్యకారుడు రవీంద్రనాథ్ టాగూర్ నడయాడిన శాంతినికేతన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్‌ను చేర్చాలని సలహా మండలి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీవోఎమ్‌వోఎస్) ప్రతిపాదించింది. శాంతినికేతన్ ఏకైక లివింగ్ హెరిటేజ్ యూనివర్శిటీగా నామినేట్ చేయబడింది.
ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి బుధవారం (మే,2023) ట్విటర్‌లో తెలిపారు. టాగూర్ 162వ జయంతి రోజున భారత్‌కు ఈ శుభవార్త అందింది అని మంత్రి తెలిపారు. ‘‘ఇది మన ఘన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని మరింత పెంచింది ’’ అని కిషన్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రుడు రచయితగానే ఉండిపోలేదు. బాలల హృదయాలను వికసింపచేయటానికి ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.కేవలం ఐదుగురు విద్యార్థులతో మొదలైన ఈ శాంతినికేత్ క్రమంగా విస్తరించింది.
నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ పశ్చిమ బెంగాల్ బీర్‌భూమ్ జిల్లాలో కోల్ కతాకు 152 కిలోమీటర్ల దూరంలో ఈ శాంతినికేతన్ ఉంది. దాదాపు 1983లో 20 ఎకరాల విస్తీర్ణంలో శాంతినికేతన్ నెలకొంది.అది అంతకంతకు విస్తరించింది.