SBI Cyber Attack: SBI ఖాతాలు హ్యాక్.. డార్క్ వెబ్‌లోకి 3,897 మంది డేటా.. ఖాతాలు సురక్షితమేనా? ధ్రువీకరించిన బ్యాంకు

సైబర్ దాడి కారణంగా 3,897 మంది కస్టమర్ల వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు ఎస్‌బీఐ(SBI Cyber Attack) తెలిపింది.

Sbi cyber attack data of 3897 customers leaked on dark web

SBI Cyber Attack: భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఖాతాదారులను కలవరపెట్టే వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఒక భారీ సైబర్ దాడి కారణంగా దాదాపు 3,897 మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్‌కు గురై డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు బ్యాంక్ అధికారికంగా ధృవీకరించింది. ఇందులో ఖాతాదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీలు, నివాస చిరునామాలు, ఇమెయిల్ ఐడీలు ఉన్నట్లు తెలిసింది. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికల ద్వారా ఈ డేటా లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Kim Jong Un: కోమాలో ఉత్తర ‘కొరియా అధ్యక్షుడు’.. కిమ్ జోంగ్ ఉన్ కు బ్రెయిన్ హెమరేజ్‌? చైనాకు తరలింపు!

ఆర్థిక లావాదేవీలపై ప్రభావం లేదు.. స్పష్టం చేసిన బ్యాంక్ యాజమాన్యం:

ఈ సైబర్ దాడి వల్ల కొందరు కస్టమర్ల(SBI Cyber Attack) వ్యక్తిగత రికార్డులు బహిర్గతమైనప్పటికీ, బ్యాంక్ ప్రధాన ఆర్థిక వ్యవస్థపై లేదా లావాదేవీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, రోజువారీ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సురక్షితంగా, యథావిధిగా కొనసాగుతున్నాయని కస్టమర్లకు భరోసా ఇచ్చింది. కస్టమర్ల సొమ్ము పూర్తిగా సురక్షితంగా ఉందని యాజమాన్యం ప్రకటించింది.

కొనసాగుతున్న విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు:

హ్యాక్ అయిన డేటా భద్రతను పునరుద్ధరించడానికి, బ్యాంక్‌తో పాటు వినియోగదారులకు కలిగిన నష్ట తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడానికి సమగ్ర దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం లీక్ అయిన రికార్డులపై లోతైన విచారణ జరుపుతోంది. ఈ విచారణ పూర్తయిన వెంటనే తగిన భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.