Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వరదలు.. స్తంభించిన జనజీవనం.. బంద్ ప్రకటించిన ప్రభుత్వం
బెంగళూరు మహానగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
- Narender Thiru
- Published On : August 30, 2022 / 05:02 PM IST
Bengaluru: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం వరదమయమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సమాచార, రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పూర్తిగా జనజీవనం స్తంభించింది.
Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి
దీంతో ప్రభుత్వం మంగళవారం బెంగళూరు మహానగరంలో సెలవు ప్రకటించింది. బెంగళూరుతోపాటు బెలగావి, ఇతర కర్ణాటక జిల్లాలకు భారత వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. రోడ్లపై పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ప్రధాన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల మోకాలి లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బెంగళూరు-మైసూరు హైవేపై రవాణా చాలా వరకు నిలిచిపోయింది.
Jaishankar: సరిహద్దు అంశం మీదే.. భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్
నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పర్యటించారు. సహాయక చర్యలు వేగవంతం చేస్తామని ప్రకటించారు. పూర్తిగా వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు బోట్లలో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
