Jaishankar: సరిహద్దు అంశం మీదే.. భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్

సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.

Jaishankar: సరిహద్దు అంశం మీదే.. భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్

Jaishankar: భారత్-చైనా సరిహద్దులో ఉన్న పరిస్థితి ఆధారంగానే, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్. న్యూఢిల్లీలో ఏర్పాటైన ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

First Makeup-Free Contestant: మేకప్ వేసుకోకుండా మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని అదరగొట్టిన అమ్మాయి

ఈ సందర్భంగా భారత్-చైనా సంబంధాలపై మాట్లాడారు. ‘‘భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దులో ఉన్న పరిస్థితిని బట్టే, ఇరు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయి. గతంలోలాగా రెండు దేశాల మధ్య సానుకూలత, స్థిరత్వం ఏర్పడాలంటే మూడు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ‘పరస్పర సున్నితత్వం, పరస్పర గౌరవం, పరస్పర ఆసక్తు’ల మీదే సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే’’ అని జై శంకర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్-చైనా సంబంధాల మీదే ఆసియా అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.

Viral video: రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. అతడి బైకు మాత్రం ముక్కలు ముక్కలు

అభివృద్ధిలో ప్రస్తుత ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు జై శంకర్ చెప్పారు. ఇదే కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రడ్ పాల్గొన్నారు.