First Makeup-Free Contestant: మేకప్ వేసుకోకుండా మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని అదరగొట్టిన అమ్మాయి

చాలా మంది అమ్మాయిలు అందాన్నే ప్రాణంగా భావిస్తారు. అందంగా కనపడడానికి బాగా మేకప్ వేసుకుంటారు. ఓ అమ్మాయి మాత్రం బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే ముఖ్యమని నిరూపించాలనుకుంది. మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫైనల్ కు చేరి రికార్డు నెలకొల్పింది. దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న మిస్ ఇంగ్లండ్ పోటీల్లో మేకప్ లేకుండా పోటీ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మనం సంతోషంగా ఉంటే మన ముఖాన్ని మేకప్ తో కప్పుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

First Makeup-Free Contestant: మేకప్ వేసుకోకుండా మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని అదరగొట్టిన అమ్మాయి

First Makeup-Free Contestant

First Makeup-Free Contestant:  చాలా మంది అమ్మాయిలు అందాన్నే ప్రాణంగా భావిస్తారు. అందంగా కనపడడానికి బాగా మేకప్ వేసుకుంటారు. అందం విషయంలోనూ సమాజంలో వివక్ష ఉంది. ఇక మోడలింగ్ రంగంలో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్ లను పెట్టుకుంటారు. పోటీల్లో పాల్గొనాలంటే మేకప్ తప్పనిసరి అని భావిస్తారు. మేకప్ వేసుకోకపోతే అసలు పోటీల్లో ఒక రౌండ్ కూడా గెలవలేమని అనుకుంటారు.

అయితే, ఓ అమ్మాయి మాత్రం బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే ముఖ్యమని నిరూపించాలనుకుంది. అందాల పోటీల విషయంలో అమ్మాయిలపై కొనసాగుతోన్న వివక్షను తొలగించాలని భావించింది. మేకప్ లేకుండా అందాల పోటీలో పాల్గొని తనను తాను నిరూపించుకుంటూ చివరకు ఫైనల్ కు చేరుకుంది. మిస్ ఇంగ్లండ్ పోటీలను దాదాపు 100 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొనే అమ్మాయిలు అందరూ మేకప్ వేసుకునే వస్తారు.

తాజాగా, మెలిసా రవూఫ్ అనే అమ్మాయి మాత్రం బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే ముఖ్యమని చాటిచెబుతూ మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫైనల్ కు చేరి రికార్డు నెలకొల్పింది. దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న మిస్ ఇంగ్లండ్ పోటీల్లో మేకప్ లేకుండా పోటీ చేయడం ఇదే మొట్టమొదటిసారి. లండన్ లో పొలిటికల్ సైన్స్ చదువుతోన్న మెలిసా మిస్ ఇంగ్లండ్ పోటీల్లో సెమీఫైనల్ లోనూ జడ్జిలను మెప్పించి, ఫైనల్ రౌండ్ కు వెళ్లింది. అక్టోబరులో జరిగే పోటీల్లో 40 మంది అమ్మాయిలతో మిస్ ఇంగ్లండ్ కిరీటం కోసం ఆమె పోటీ పడనుంది.

ఎటువంటి మేకప్ వేసుకోకుండా పోటీల్లో ఆమె ఫైనల్ కు చేరడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ… అందంపట్ల అమ్మాయిలు ఆత్మనూన్యత భావానికి గురి కావద్దని, ఈ సందేశాన్ని ఇవ్వడానికే పోటీల్లో పాల్గొనే సమయంలోనూ తాను మేకప్ వేసుకోలేదని చెప్పింది. నిరాడంబరంగా, నవ్వుతూ ఉండడంలోనే అందం ఉంటుందని చెప్పింది. అందరి ముందూ అందంగా కనపడాలన్న భావనతో ఒత్తిడికి గురవుతూనే అమ్మాయిలు మేకప్ వేసుకుంటున్నారని తెలిపింది. మనం సంతోషంగా ఉంటే మన ముఖాన్ని మేకప్ తో కప్పుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు