COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు 

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదయ్యాయి. దేశంలో నిన్న 5,439 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, అదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 65,732 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు 

COVID-19

COVID 19: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదయ్యాయి. దేశంలో నిన్న 5,439 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, అదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 65,732 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

వారాంతపు పాజిటివిటీ రేటు 2.64 శాతంగా ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.66 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకి కోలుకున్న కేసులు 4,38,25,024గా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 88.55 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 3,20,418 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు 212.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వాడినట్లు పేర్కొంది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.23 కోట్లుగా, బూస్టర్ డోసుల సంఖ్య 15.66 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో 26,36,224 డోసులు వేసినట్లు తెలిపింది.

Purification ritual after Siddaramaiah’s visit: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సందర్శించిన ఆలయాన్ని శుద్ధి చేసిన సిబ్బంది