Purification ritual after Siddaramaiah’s visit: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సందర్శించిన ఆలయాన్ని శుద్ధి చేసిన సిబ్బంది

సిద్ధరామయ్య చర్యను అపచారంగా భావించిన దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని శుద్ధీకరణ చేశారు. బసవేశ్వర ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ శుద్ధీకరణ జరిగింది. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ ఆలయాన్ని శుద్ధి చేయనున్నట్లు రెండు రోజుల క్రితమే బసవేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ వరప్రసాద్ మీడియాకు కూడా చెప్పారు. 

Purification ritual after Siddaramaiah’s visit: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సందర్శించిన ఆలయాన్ని శుద్ధి చేసిన సిబ్బంది

purification ritual’ after Siddaramaiah’s visit

Purification ritual after Siddaramaiah’s visit: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కొన్ని రోజుల క్రితం కొడగు జిల్లా మడికేరి ప్రాంతంలో సందర్శించిన ఆలయాన్ని ఆ దేవస్థాన సిబ్బంది శుద్ధి చేశారు. సిద్ధరామయ్య ఈ నెల 19న మాంసం తిని గుడికి వెళ్ళడంతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆయన గెస్ట్‌ హౌస్‌లో నాటుకోడి పులుసు, మటన్‌ తిని ఆలయాలనికి వెళ్ళారు. దీంతో బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. హిందువుల విశ్వాసాలను అవమానించారని మండిపడింది.

ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలోనే ఆలయాలకు వెళ్తున్నారని, అది కూడా మాంసం తిని వెళ్ళడం ఏంటని నిరసనలు కూడా తెలిపింది. అయితే, అప్పట్లోనే సిద్ధరామయ్య స్పందిస్తూ మధ్యాహ్నం సమయంలో మాంసం తిని సాయంత్రం సమయంలో ఆలయానికి వెళ్తే తప్పేంటని అన్నారు. అనంతరం యూటర్న్ తీసుకుని అసలు ఆ రోజు మాంసమే తినలేదని చెప్పారు.

అయితే, సిద్ధరామయ్య చర్యను అపచారంగా భావించిన దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని శుద్ధీకరణ చేశారు. బసవేశ్వర ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ శుద్ధీకరణ జరిగింది. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ ఆలయాన్ని శుద్ధి చేయనున్నట్లు రెండు రోజుల క్రితమే బసవేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ వరప్రసాద్ మీడియాకు కూడా చెప్పారు.

Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేసిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన అధికారులు